Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ రష్మీ గౌతమ్ కాంబో: కెవ్వు కేక తరహాలో ఐటెం సాంగ్..

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (13:35 IST)
Pawan_Rashmi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అందాల యాంకర్.. గ్లామర్ గర్ల్, జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ చిందులేయనుంది. పవర్ స్టార్ సినిమాలో రష్మి గౌతమ్ ఐటెం సాంగ్ చేయనుందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. 
 
ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా బోనీ కపూర్‌కు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌తో కూడిన లాయర్ పాత్రలో నటిస్తున్నారు. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అందులో భాగంగా ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో శృతి హాసన్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈమెతో రెండు పాటలు కూడా ఉన్నాయి. మరోవైపు మాస్ ప్రేక్షకులకు ఊపు తెచ్చేలా ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సాంగ్‌ను క్లబ్ సాంగ్‌లా ప్లాన్ చేసారు. 
 
ఈ పాటను ఎక్స్‌ట్రా జబర్ధస్త్ యాంకర్ రష్మి గౌతమ్ పై ప్లాన్ చేసినట్టు సమాచారం. రష్మి గౌతమ్ కూడా పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో వెంటనే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌కు ఒకే చెప్పినట్టు సమాచారం. కెవ్వు కేక తరహాలో ఈ ఐటెం సాంగ్ ఉండనున్నట్టు సమాచారం. ఈ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నట్టు సమాచారం. ఈ సాంగ్‌తో రష్మీ గౌతమ్‌కు మంచి క్రేజ్ వస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments