Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి కోడిపుంజు 'కాటమరాయుడు' లుక్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రంతో సంక్రాంతికి సందడి చేస్తుండగా తెలుగు సంవత్సరాదికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సంక్రాంతికి కాటమరాయుడు సంక్రాంతి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్య

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (14:19 IST)
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రంతో సంక్రాంతికి సందడి చేస్తుండగా తెలుగు సంవత్సరాదికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సంక్రాంతికి కాటమరాయుడు సంక్రాంతి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్‌ల కాంబినేషన్లో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత శరత్ మరార్, దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో వినూత్న రీతిలో చేసిన 'కాటమరాయుడు' ప్రచారం అభిమానుల్లో హుషారు పుట్టించింది. ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకి చిత్ర బృందం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. సంక్రాంతి కానుకగా మరికొన్ని ప్రచార చిత్రాలని విడుదల చేస్తున్నారు. చిత్రం మొదటి టీజర్‌ని జనవరి 26న  విడుదల చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలిపారు.
 
సంక్రాంతి విరామం తరువాత, 16న మొదలయ్యే షూటింగ్, ఏకధాటిగా జరగబోయే షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది. సినిమా 2017 మార్చి 29న 'ఉగాది'కి విడుదల కానుంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, కళ: బ్రహ్మ కడలి. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో అలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments