Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ అప్పటికి, ఇప్పటికి వ్యక్తిగా ఒకేలా వున్నారు : వాసుకి

Webdunia
మంగళవారం, 9 మే 2023 (17:25 IST)
Vasuki
యాక్టింగ్ కెరీర్ ని ఎందుకు సీరియస్ తీసుకోలేదంటే, యాక్టింగ్ కాదు.. నేను దేన్ని సీరియస్ గా తీసుకొను. ఇదే మన దారి.. ఇదే చేయాలని అనుకోను. అది నా తత్త్వం. కొంచెం ఫిలసాఫికల్ గా వెళ్ళిపోతాను. అని నటి వాసుకి తెలిపారు. 
 
ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన 'అన్నీ మంచి శకునములే' వాసుకి నటించారు. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో వాసుకి పలు  విశేషాలని పంచుకున్నారు.
 
23 ఏళ్ళు తర్వాత ‘అన్నీ మంచి శకునములే’ కథతోనే రావాలని ఎందుకు అనిపించింది ?
తొలిప్రేమ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు నచ్చిన అవకాశాలు కూడా వచ్చాయి. కానీ చేయడం నాకు కుదరలేదు. ఎందుకంటే నేను మల్టీ టాస్కర్ కాదు. అన్ని పనులు ఒకేసారి చేయలేను. ముందు పిల్లలు, వాళ్ళ చదువులు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ (ఫోర్త్ ఇయర్) బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. ఆనంద్ గారు ఆయన పనిలో బిజీగా వుంటారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి సమయంలో నందిని రెడ్డి గారు ఈ కథతో వచ్చారు. నాకు నచ్చింది. సినిమాతో పాటు చదువుపై కూడా ద్రుష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను.
 
ఇండస్ట్రీ కి దూరం అయ్యారనే ఫీలింగ్ ఉండేదా ?
లేదండీ. ఇరవై మూడేళ్ళుగా సినిమాలు చేయకపోయినప్పటికీ ఆనంద్ గారి వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే వుంటుంది. అలాగే సినిమా చేసిన్నప్పుడు కూడా నేను ఇండస్ట్రీ దగ్గర ఉన్నాననే ఫీలింగ్ లేదు(నవ్వుతూ)
 
ఇందులో పాత్రచేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
ఒక విరామం తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నామంటే మన కంఫర్ట్ జోన్ ముఖ్యం. తొలిప్రేమ చేసినప్పుడు నాకు 18 ఏళ్ళు. అప్పుడు డైలాగ్ రాకపోయినా, తెలుగు రాకపోయినా, కొత్త స్థలమైనా..ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతాం. ఈ ఏజ్ లో రీఎంట్రీ చేయాలంటే మాత్రం ఒక సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ చూస్తాం. స్వప్న ఎప్పుడూ సినిమా చేయమని అడుగుతుండేది. ఫైనల్ గా నాకు సినిమా చేయానికి వీలు కుదిరింది. కథ విన్న వింటనే సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ ఫీలయ్యాను. ఓకే చెప్పాను.
 
ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో చాలా క్యూట్ సిస్టర్ పాత్రలో కనిపిస్తా. అన్నీ ఫ్యామిలీస్ లో వున్న సిస్టర్ క్యారెక్టరె. తమ్ముడు ఏం చేసినా సపోర్ట్ చేసే ఒక అక్క వుంటుంది. అలాంటి పాత్రే నాది. నాకు, సంతోష్ పాత్ర కు చాలా మంచి బాండింగ్ వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.
 
అప్పుడు సిస్టర్ రోల్.. మళ్ళీ ఇప్పుడు సిస్టర్ రోల్ ఏంటని అనిపించలేదా?
తల్లి పాత్ర ఇవ్వలేదు సంతోషించాలి. నిజానికి కథ బావుంటే తల్లి పాత్ర చేయడానికి కూడా రెడీనే. నందిని ఈ కథ చెప్పినపుడు చాలా ఎమోషన్ కి కనెక్ట్ అయ్యాను. అందుకే ఈ పాత్ర చేశాను. నిజానికి నాకు బ్రదర్స్ లేరు. ఆ ఎమోషన్ నాకు పర్శనల్ గా కనెక్ట్ కాదు. కానీ తొలిప్రేమలో కరుణాకరన్ చెప్పిన విధానం చాలా కనెక్టింగ్ గా అనిపించింది. ఇప్పుడు నందిని కూడా చాలా మంచి ఎమోషన్ తో ఈ సినిమాని తీశారు.
 
స్వప్న గారితో మీ స్నేహం ఎలా మొదలైయింది ?
ఆనంద్, దత్ గారి కుటుంబానికి చాలా దగ్గర. ఆనంద్ నాన్న గారు దత్ గారి సినిమాలు చేసేవారు, అప్పటి నుంచే వాళ్ళు మంచి స్నేహితులు. ఆనంద్ ,స్వప్నతో పరిచయం చేశారు. మేము ఇరుగుపొరుగు వుండేవాళ్ళం. స్వప్న గారి భర్త ప్రసాద్, ఆనంద్ మంచి ఫ్రండ్స్. అంతా ఫ్యామిలీ ఫ్రండ్స్ లా వుంటాం.
 
సంతోష్ శోభన్ పాత్ర ఎలా వుంటుంది ?
సంతోష్ చాలా స్వీట్ పర్సన్. అక్కా అని పిలిస్తాడు. చాలా డౌన్ టూ ఎర్త్. చాలా కేరింగ్. ఇందులో రిషి పాత్ర సంతోష్ వ్యక్తిత్వానికి దగ్గరగా వుంటుంది.
 
తొలి ప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం ఎలా వుంది ?
ఆనంద్, కళ్యాణ్ చాలా మంచి స్నేహితులు. సహజంగానే మా మధ్య మంచి అనుబంధం వుంది. కళ్యాణ్ అప్పటికి, ఇప్పటికి వ్యక్తిగా ఒకేలా వున్నారు.  
 
యాదాద్రి నిర్మాణంలో ఆనంద్ గారి పని తీరుకి చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో మీ పాత్ర ఎలా వుండేది?
యాదాద్రి ప్రాజెక్ట్ ఆరంభం నుంచి చివరి దాక నేను ఆయనతోనే వున్నాను. చిన్న కాగితంలో కొండని గీసి చూపించినప్పటి నుంచి సిఎం కేసిఆర్ గారు ఆయనకి సన్మానం చేసిన రోజు వరకూ.. ప్రాజెక్ట్ సంబధించిన ప్రతి డెవలప్ మెంట్ నాకు తెలుసు. ఆయన ప్రతిది చెప్పేవారు. యాదాద్రి ప్రాజెక్ట్ చేయడం మాకు దొరికిన భాగ్యం. గొప్ప ప్రాప్తం. అది చరిత్రలో నిలిచిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments