Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్.. పవన్ అంటే ఇష్టం.. డ్యాన్స్‌లో ఆ ఇద్దరూ ఇద్దరే..!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (16:05 IST)
pranitha
టాలీవుడ్ స్టార్ హీరోలపై హీరోయిన్ ప్రణీత ప్రశంసల వర్షం కురిపించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రణీత తెలిపింది. ఇతర హీరోల విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అందగాడని, జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్ అని.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ ఇద్దరేనని కితాబిచ్చింది. ప్రభాస్ సూపర్ స్టార్ అని కొనియాడింది. 
 
బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. తమిళంలో హీరో అజిత్ తనకు ఎంతో ఇష్టమని.. తమిళ భాష తనకు అర్థం కాకపోయినా ఆయన నటించే సినిమాలన్నీ చూస్తుంటానని చెప్పింది. మహేష్ బాబు గురించి ఒక్క పదంలో చెప్పమంటే ‘హ్యాండ్‌సమ్’ అని బదులిచ్చింది. ఇంకా ప్రణీతను ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు, ఆమె చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
  
బోర్ కొట్టినప్పుడు బిసిబెలెబాత్ చేసుకుని తింటానని.. ధోనీ వచ్చే ప్రపంచ కప్‌లో ఆడాలని కోరుకుంటానని చెప్పింది. కరోనా గురించి మాట్లాడుతూ.. 24 మూవీ వాచ్ దొరికితే.. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి చైనాను శాకాహారిగా మార్చేస్తానని తెలిపింది. పెసరట్టు తనకు ఇష్టమైన వంటకమని ప్రణీత చెప్పుకొచ్చింది.

సమంత గురించి మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి పనిచేస్తుంది. ఆమెతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. ఆమె అంటే ఎంతో గౌరవం, స్ఫూర్తిదాయకమని ప్రణీత వెల్లడించింది. కాఫీ అంటే తెగ ఇష్టమని ఆమె వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments