Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

దేవీ
శుక్రవారం, 16 మే 2025 (13:34 IST)
Hari Hara Veeramallu date poster
పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తిచేశారని చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం తెలియజేశారు. తాజాగా ఆయన మరో సినిమా ఓటీ షూటింగ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లుగా చిత్ర టీమ్ పోస్ట్ చేసింది. ఇప్పుడు హరిహరవీరమల్లు విడుదల డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూన్ 12న విడుదలతేదీ ప్రకటించారు. పవర్ స్టార్ యుద్ధాన్ని చూసేందుకు సన్నంద్ధం కండీ అంటూ టాగ్ పోస్ట్ చేశారు.
 
ధర్మం కోసం జరిగే యుద్ధమే హరిహరవీరమల్లు అంటూ కథ గురించి చూచాయిగా చెప్పేశారు. చారిత్రక నేపథ్యంలో జరిగిన ఓ ఘటనతో సినిమా తెరకెక్కించారు. ఇది రెండు భాగాలుగా వుండబోతోంది. ఎ.ఎం. జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ నాయికగా నటిస్తోంది. సన్నీడియోల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. రాచరిక కాలంనాటి కథతో రూపొందుతోందని తెలుస్తోంది. ఇప్పటికే కీరవాణి బాణీలకు మంచి స్పందన వచ్చింది.
 
ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేస్తూనే పవన్ కళ్యాణ్, ఓజీ సినిమాను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యాడు. గతంలో విజయవాడ ప్రాంతంలో భారీ సెట్‌లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఓజీ చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇప్పుడు లేటెస్ట్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments