Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకమ్మా భయం...? నేను నీ కొడుకునే... తినండి... ఫిష్ కర్రీ వడ్డించిన పవన్, ఆ తర్వాత లక్ష

పవన్ కళ్యాణ్ చేస్తున్న దానాల గురించి పెద్దగా పబ్లిసిటీ చేసుకోరనేందుకు మరో నిజం ఇది. వివరాల్లోకి వెళితే... మేము సైతం ఇప్పుడు అందరినీ కట్టిపడేసే కార్యక్రమంలా మారింది. ఈ షోలో ఓ వృద్ధురాలు చెప్పిన విషయాలను చూసినప్పుడు పవన్ దాతృత్వ గుణం మరోసారి వెలుగుచూసి

Webdunia
ఆదివారం, 26 జూన్ 2016 (12:55 IST)
పవన్ కళ్యాణ్ చేస్తున్న దానాల గురించి పెద్దగా పబ్లిసిటీ చేసుకోరనేందుకు మరో నిజం ఇది. వివరాల్లోకి వెళితే... మేము సైతం ఇప్పుడు అందరినీ కట్టిపడేసే కార్యక్రమంలా మారింది. ఈ షోలో ఓ వృద్ధురాలు చెప్పిన విషయాలను చూసినప్పుడు పవన్ దాతృత్వ గుణం మరోసారి వెలుగుచూసింది. ఆమె చెప్పిన వివరాలు... ఖమ్మంలో తను వృత్తి రీత్యా టీచర్. ఐతే వృద్ధుల కోసం ఆమె వృద్ధాశ్రమం నడుపుతుండేది. కానీ తన రిటైర్మెంట్ జరిగాక ఇక ఆ ఆశ్రమాన్ని ఎలా నడపాలా అని దిగ్గు తెలియని స్థితిలో పడిపోయింది. 
 
ఆ సమయంలో ఎవరో పవన్ కళ్యాణ్ మీకు సాయపడతారని చెప్పారట. అంతే... ఆమె హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు గేటు వద్ద తచ్చాడారట. ఆమెను చూసిన పవన్ భార్య గేటు ముందు ఎవరో వృద్ధురాలు తిరుగుతున్నారని చెప్పగానే స్వయంగా బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆమెను కారులో కూర్చోబెట్టుకుని తన కార్యాలయానికి తీసుకెళ్లారట. అక్కడ ఆమె చెప్పిన వివరాలన్నీ తెలుసుకుంటూనే కాఫీ కలిపి ఇచ్చి, చేపల కూర తెప్పించి తనే వడ్డించారట. 
 
ఆ సమయంలో ఆమె కాస్త భయపడుతుంటే... ఎందుకమ్మా భయపడతారు. నేను నీ కొడుకుని... మీరు నా అమ్మ... తినండి అంటూ చెప్పారట. ఆమె భోజనం ముగిశాక వృద్ధాశ్రమానికి అవసరమైన లక్ష రూపాయలు నగదు బ్యాంకు ఖాతాలో వేయడమే కాకుండా మరో 10 వేల రూపాయలు ఆమె చేతికి ఇచ్చి పంపారట. ఇది జరిగిన నాలుగైదు సంవత్సరాలు దాటిపోయింది. ఈ విషయాలన్నీ ఆమె చెపుతుంటే అంతా కళ్లార్పకుండా అలా చూస్తుండిపోయారు. పవర్ స్టార్ గ్రేట్ కదూ...

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments