Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బర్ సింగ్ ఇష్టపడి చేయని పవన్.. నాగబాబు అప్పుల కోసమేనట! (video)

సెల్వి
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (14:19 IST)
Nagababu
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. తమ్ముడు తనను ఆదుకున్న సంగతిని స్వయంగా ఆయనే పలుమార్లు బయటపెట్టారు.
 
ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో పవర్‌స్టార్ బ్లాక్‌బస్టర్ మూవీ గబ్బర్ సింగ్‌ను 4కే వెర్షన్‌లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. హిందీలో హిట్ అయిన సల్మాన్ ఖాన్ దబాంగ్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు దర్శకుడు హరీశ్ శంకర్. 
 
మే 11, 2012లో సమ్మర్ కానుకగా రిలీజైన గబ్బర్ సింగ్ సంచలన విజయం నమోదు చేసింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.79 కోట్ల వసూళ్లను సాధించింది.
 
నిజానికి ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఇష్టపడి చేయలేదు.. కేవలం అన్నయ్య నాగబాబును అప్పుల్లో నుంచి గట్టెక్కించడానికే చేశారట. ఆరెంజ్ సినిమా మిగిల్చిన నష్టాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు డిప్రెషన్‌లోకి వెళ్లారు. 
 
దీంతో ఆయనను ఆదుకునేందుకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్.. రూ.ఐదు కోట్ల సాయంతో పాటు తన నెక్ట్స్ సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ మొత్తాన్ని ఇస్తానని మాటిచ్చారట. 
 
గబ్బర్ సింగ్ లాభాలతో అన్నయ్య అప్పులు తీర్చి మిగతా ఎంత మిగిలితే అంత తీసుకో, తన రెమ్యునరేషన్ సంగతి తర్వాత చూద్దాం అని అగ్రిమెంట్‌ సమయంలో నిర్మాత బండ్ల గణేష్‌తో పవన్ అన్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments