Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే : పవన్ కళ్యాణ్

Webdunia
శనివారం, 25 జులై 2020 (18:09 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ మూవీ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగులు జరిపే అవకాశాలు లేవని చెప్పుకొచ్చారు. 
 
ఆయన తాజాగా ఓ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమేనని చెప్పుకొచ్చారు.
 
ఇటీవల కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.
 
కాగా, పవన్ కళ్యాణ్ చేస్తున్న తాజా ప్రాజెక్టు వకీల్ సాబ్. ఇది బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్. ఈ చిత్రం షూటంగ్ 70 నుంచి 80 శాతం మేరకు పూర్తయింది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments