Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

డీవీ
సోమవారం, 24 జూన్ 2024 (15:11 IST)
C Ashwinidat wishes Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారితో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో నేడు  తెలుగు సినీ నిర్మాతల సమావేశం జరిగింది.  తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తమ ఆలోచనలను అశ్వనిదత లిఖితపూర్వకంగా ఇచ్చారు.  సినీ పరిశ్రమ ఇబ్బందులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నివేదించారు. 
 
Kandula Durgesh, Allu Aravind C Ashwinidat A.M. Ratnam Dil Raju Mrs. Supriya
ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, నిర్మాతలు   అల్లు అరవింద్, సి అశ్వినీదత్,   ఏ.ఎం. రత్నం,  ఎస్.రాధాకృష్ణ (చినబాబు),  దిల్ రాజు,   బోగవల్లి ప్రసాద్,  డి.వి.వి.దానయ్య , శ్రీమతి సుప్రియ,  ఎన్.వి.ప్రసాద్,  బన్నీ వాసు,   నవీన్ ఎర్నేని,   నాగవంశీ,  టి.జి.విశ్వప్రసాద్,   వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.

నట్టికుమార్ ఫైర్ 
 కాగా, సినీ పెద్దలూ! విభజించి పాలించు పద్ధతిని మార్చుకోరా!  అసలు మీరు మారరా! మీలో మార్పు రాదా? చిన్న నిర్మాతలను తెలియాజేయరా అంటూ  నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ మంది పడ్డారు.
 
సినిమా పరిశ్రమ అంటే మేమే అన్న రీతిలో ఒంటెద్దు పోకడలతో కొందరు సినీ పెద్దలు గత ప్రభుత్వ హయాంలో చర్చలకు వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తించారో...ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అలానే వ్యవహరిస్తున్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. 
 
ఏపీలోని గత ప్రభుత్వం వల్ల చిత్ర పరిశ్రమకు ఒరిగింది ఏమీ లేదు. అప్పట్లో కూడా ప్రభుత్వం చర్చలకు పిలిచినపుడు ఎవరైతే సినీ పెద్దలు వెళ్లారో.... ఇప్పుడొచ్చిన కొత్త ప్రభుత్వం వద్దకు కూడా ఆ పెద్దలే తిరిగి వెళుతున్నారు. కొత్త ప్రభుత్వానికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని కలసి అభినందనలు చెప్పడానికి వారు వెళుతుండటం మహదానందమే. కానీ విభజించు పాలించు రీతిలో కాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున అఫిషియల్ గా అనౌన్స్ చేసి, చిన్న, మధ్య తరహా బడ్జెట్ నిర్మాతలను కలుపుకుని వెళితే చాలా బావుండేది. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా సినిమా పరిశ్రమ అంటే మేమే అన్న రీతిలో ఒంటెద్దు పోకడలతో ఎలా ప్రవర్తించారో ఇప్పుడు ప్రభుత్వం మారగానే మళ్ళీ సీనులోనికి వచ్చేసి, ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా కొంతమంది పెద్దలు వారికి వారే వెళ్లాడానికి పూనుకోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని నట్టికుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments