Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్పనుమ్ కోషియం రీమేక్.. షూటింగ్‌లతో పవన్ బిజీ

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (12:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ అరంగేట్రం కారణంగా సినిమాలకు దూరమైన పవన్ మళ్లీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల పవన్ తన రాజకీయ పార్టీ సమావేశాల కారణంగా సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకున్నారు. పవన్ కళ్యాన్ జనసేన నాయకులతో ఆంధ్రాలోని పొలిటికల్ టెన్సన్‌పై చర్చించారు.
 
అయితే తాజాగా తన సమావేశాలను ముగించుకొని పవర్ స్టార్ మళ్లీ సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. బుధవారం నుంచి పవన్ తన తదుపరి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా రానా దగ్గుపాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సరిహద్దుల్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ రానా, పవన్ కాంబో సన్నివేశాలను రూపొందిస్తున్నారు. 
 
ఈ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాన్ రీఎంట్రీ తరువాత చేసిన మొదటి సినిమా వకీల్‌సాబ్ ఏప్రిల్9న విడుదల కానుంది. ఆ తాలూకా హంగామా కూడా మొదలైంది. వకీల్‌సాబ్ నుంచి మరో పాట కూడా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments