Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ అంతేమరి... చిరు సతీమణి సురేఖ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారట...

మెగా ఫ్యామిలీ. చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి స్వయంకృషి ఫలితంగా చిన్న విత్తనంగా మొదలై ఇప్పుడు మహావృక్షంగా ఎదిగింది. చిరంజీవి శ్రమ, ఆయన అకుంఠితదీక్ష ఆ కుటుంబాన్ని టాలీవుడ్‌లో పైస్థాయి

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (18:43 IST)
మెగా ఫ్యామిలీ. చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి స్వయంకృషి ఫలితంగా చిన్న విత్తనంగా మొదలై ఇప్పుడు మహావృక్షంగా ఎదిగింది. చిరంజీవి శ్రమ, ఆయన అకుంఠితదీక్ష ఆ కుటుంబాన్ని టాలీవుడ్‌లో పైస్థాయికి చేర్చింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు తెలుగు సినీపరిశ్రమను శాసిస్తున్నారు. ఆ హీరోలకు సినిమాల్లోనే కాదు పర్సనల్ లైఫ్‌లో కూడా ఎంతో క్రేజ్ ఉంది. 
 
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌ స్వయంకృషితో ఎదిగినా ఇప్పుడు పరిశ్రమలో ఆయనొక బ్రాండ్. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కొన్ని నెలల తరువాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం పవన్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో కొన్నిరోజుల పాటు అన్నకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల ఆ దూరం దగ్గరకు చేరింది. 
 
ఇదంతా ఇలావుంటే చిరు భార్య సురేఖ అంటే పవన్ కళ్యాణ్‌‌కు ఎంతో అభిమానం వుంది. ఆమె తనకు తల్లితో సమానమని అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించారు కూడా. చిరంజీవి మాటను పెడచెవిన పెట్టినా సురేఖ చెబితే మాత్రం పక్కాగా ఫాలో అయిపోతారు. వొదినమ్మ చెబితే పవర్ స్టార్ పిల్లాడిలా మారిపోయి ఏం చెబితే అది అనుసరిస్తారట.
 
సురేఖ మోకాలకు ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. దీంతో కొన్ని రోజులపాటు ఆమె ఆసుపత్రికే పరిమితమయ్యారు. సరిగ్గా ఇదే సమయంలోనే నాలుగో సంతానంతో పవన్ ఆనందంలో ఉన్నాడు. అయితే తనకు పుట్టిన చిన్నారిని వదినకి చూపించలేకపోతున్నామని బాధపడ్డ పవన్ నేరుగా భార్యతో పాటు చిన్నారిని తీసుకుని మరీ ఆసుపత్రికి వెళ్ళాడు. సురేఖకు శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్ళి చిన్నారిని ఆమె చేతిలో పెట్టాడు. దీంతో సురేఖ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారట. చిన్నారిని ఆశీర్వదించారట. ఇది వదినంటే పవన్ కళ్యాణ్‌‌కు ఉన్న ఇష్టమంటున్నారు మెగా ఫ్యామిలీ సభ్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments