Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్రాయని సంగీతరావు ఇకలేరు.. కరోనాతో చెన్నైలో మృతి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (08:07 IST)
ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఘంటసాల స్వరసహచరుడు, ఆయన సంగీత గురువు పట్రాయని సీతారామ శాస్త్రి కుమారుడు పట్రాయని సంగీతరావు కన్నుమూశారు. 101 యేళ్ళ వయస్సులో కరోనా వైరస్ సోకడంతో ఆయన చెన్నైలో బుధవారం చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. 
 
కర్నాటక, హిందుస్థానీ సంగీతరీతుల్ని ఔపోషణ చేసిన పట్రాయని, హార్మోనియం, వీణ, వయోలిన్ వాయిద్యాల్లో మహాదిట్ట. ఆయన అసలు పేరు పట్రాయని వేంకట నరసింహమూర్తి. అయితే సంగీతజ్ఞుల కుటుంబానికి చెందిన తన బిడ్డ తప్పకుండా సంగీత విద్వాంసుడు అవుతాడన్న నమ్మకంత మాతృమూర్తి మంగమ్మ.. ఆయన్ను సంగీతరావు అని పిలిచవారు. తర్వాత ఆ పేరే ఆయనకు స్థిరపడింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా ఆనవరం ఆగ్రహారం సంగీతరావుది స్వస్థలం. విజయనగరం సంగీత కాలేజీలో 1938లో ఘంటసాల - సంగీతరావుకు మధ్య స్నేహం కుదిరింది. ఘంటసాల తీసిన పరోపకారి చిత్రంలో పదండి తోసుకు పదండి ముందుకు అనే పాటను పట్రాయనే పాడారు. 
 
అనేక కూచిపూడి నాటకాలకు సంగీతం అందించారు. 1956 నుంచి 1982 వరకు ఘంటసాల కుటుంబంలోనే పట్రాయని కుటుంబం ఉండేది. ఏపీ ప్రభుత్వం ఘంటసాల పురస్కారంతో సత్కరించగా, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది.

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments