Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుండె చీల్చితే రామారావు కనిపిస్తారు' : పరుచూరి వెంకటేశ్వర రావు

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2015 (16:24 IST)
స్వర్గీయ ఎన్టీ రామారావుపై పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరైన పరుచూరి వెంకటేశ్వర రావు ప్రశంసల వర్షం కురిపించారు. నందమూరి వంశం అంటే మా తమ్ముడి భాషలో చెప్పాలంటే 'గుండె చీల్చితే రామారావు కనిపిస్తారు' అని ఆయన అన్నారు.
 
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన షేర్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అనురాగదేవత' అనే సినిమాను తన సొంత బ్యానర్‌లో నిర్మించి, తమ సోదరులిద్దరితో మాటలు రాయించిన ఘనత నందమూరి తారకరామారావుదని చెప్పారు. 
 
అప్పుడే తమకు ఆ మహానుభావుడు 'పరుచూరి బ్రదర్స్' అని పేరుపెట్టారని, ఆ పేరుతోనే తమ సోదరులిద్దరమూ మాటల రచయితలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకుని స్థిరపడిపోయినట్టు చెప్పారు. 
 
మాటల రచయితలుగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఓసారి రామారావుగారు ఓ షూటింగ్ లో ఉండగా, తాను వర్షంలో నిలబడ్డానని, అప్పుడు రామారావుగారు 'బ్రదర్, ఇలా రండి' అంటూ పిలిచారని, 'నీడ' దొరికిందని అప్పుడే ఫీలయ్యామని ఆయన చెప్పారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments