#Jawaan సాయిధరమ్‌కు పరుచూరి గోపాలకృష్ణ ఆల్ ది బెస్ట్
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోను గురువారం సాయంత్రం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌ల
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోను గురువారం సాయంత్రం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది.
'జవాన్' టీంకి ఆల్ ది బెస్ట్' చెబుతూ పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. "సరిహద్దుల్లో మన భద్రత కోసం జీవించే జవాన్‌ని ఎలా ఇష్టపడతారో, వెండితెర మీద జన వినోదం కోసం జవాన్ పాత్రలో జీవించిన సాయిధరమ్ తేజ్.. జీవింపచేసిన డైరెక్లర్ బీవీఎస్ రవి... మీ శ్రమని ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. ఆల్ ది బెస్ట్" అని గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. దీనికి డైరెక్టర్ రవి థాంక్యూ సో మచ్ గురువుగారు అంటూ రీ ట్వీట్ చేశారు.
సరిహద్దుల్లో మనభద్రతకోసం జీవించే జవాన్ ని ఎలా ఇష్టపడతారో , వెండితెర మీద జన వినోదం కోసం #Jawaan పాత్రలో జీవించిన @IamSaiDharamTej జీవింపచేసిన @BvsRavi మీ శ్రమని ప్రేక్షకులు కూడా అలాగే ఇష్టపడతారు