Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ నటించిన యాక్షన్, కిడ్నాప్ డ్రామాగా పారిజాత పర్వం

డీవీ
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (17:56 IST)
Tj viswa prasad, Shraddha Das and others
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌‌ను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
వైవా హర్ష మాట్లాడుతూ, ఇలాంటి డిఫరెంట్ సినిమాలు రావాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్లు బాగా నవ్వుకునే సినిమా ఇది. డైరెక్టర్ సంతోష్ చాలా సెన్సిబుల్‌ గా ఈ సినిమాను తీశారు. ఏప్రిల్ 19న మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నా’’.
 
నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ..‘‘చాలా ప్యాషనేట్‌ గా ఈ సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ సంతోష్ ప్రాణం పెట్టి చేశారు. 19న థియేటర్లలో ఈ సినిమా చూడండి. అందరూ ఎంజాయ్ చేస్తారు.’’
 
నిర్మాత దేవేష్ మాట్లాడుతూ...‘‘నేను నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్‌ గా ఈ సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. యాంకర్ సుమ గారిని కిడ్నాప్ చేశాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.’’
 
డైరెక్టర్ సంతోష్ కంభంపాటి మాట్లాడుతూ, నేను ఏ క్యారెక్టర్‌ కు ఎవరు కావాలని రాసుకున్నానో వాళ్లందరినీ ఇచ్చారు. మాలాంటి చిన్న సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నవాళ్లకు థ్యాంక్యూ. కీడాకోలాతో చైతన్యరావు నిరూపించుకున్నారు. మిగతావాళ్లంతా ఎంత ఫన్ చేస్తారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2 గంటల 10 నిమిషాల సినిమా ఇది. ఇందులో ఫస్ట్ 25 మినిట్స్ క్యారెక్టర్స్ గురించి చెప్పడానికి తీసుకున్నా. ఆ టైమ్ తప్ప మిగతా టైమ్ అంతా నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా బాగుంటే ప్రేక్షకులందరూ ఇంకో పదిమందికి చెప్పండి. బాగా లేకపోతే వద్దని చెప్పండి. ఈ నెల 19న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి.’’
 
హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ..‘‘కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు సినిమా చేశా. గ్లామర్ పరంగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న సినిమా ఇది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుంది. నా కోసం ఈ పాత్రను రాసిన డైరెక్టర్ సంతోష్ కి థ్యాంక్యూ. ఇందులో కొంచెం సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి నిర్మాతలు ఉంటే ప్రతి ఒక్కరికీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సునీల్, హర్ష, చైతన్యతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. వాళ్ల కామెడీ టైమింగ్‌ ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. కానీ నేను కొంచెం ట్రై చేశా. ఈ సినిమాను ఏప్రిల్ 19న అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా’’.
 
హీరో చైతన్య రావు మాట్లాడుతూ..‘‘ఎక్కడో కరీంనగర్‌లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మంచి పేరు తెచ్చుకుని మంచి సినిమా చేయాలనుకుని చేస్తున్నా. ఎప్పటికైనా నా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ కి సుమ గారు యాంకరింగ్ చేయాలని అనుకున్నా. ఈ రోజు చేశారు. ఇది పెద్ద సక్సెస్‌ గా భావిస్తున్నా. 300పై చిలుకు సినిమాలు చేసి 90శాతం సక్సెస్ రేట్ ఉన్న సుమ గారు మా సినిమా చేయడం మాకు గౌరవం. మా సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. నిర్మాతలు మహీధర్, దేవేష్ నిజంగా అద్భుతమైన నిర్మాతలు. ఎంతో బిజీగా ఉన్న ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి సినిమా చేయడం చాలా కష్టం. మా డైరెక్టర్ అక్కడే ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి ఇంకో మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఇది చిన్న సినిమా కాదు.. కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ఏప్రిల్ 19న థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్‌తో చూడాల్సిన సినిమా ఇది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. అందరూ మా సినిమాను ప్రమోట్ చేయండి’’.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments