Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పందెం కోడి'లో షామిలి లేదు.. అక్షర కోసం విశాల్ నిరీక్షణ..

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (16:12 IST)
విలక్షణ నటుడు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్. బాలీవుడ్లో తెరంగేట్రం చేసి హిట్టు కొట్టి దూసుకుపోతున్న అక్షర త్వరలో కోలీవుడ్‌పై చక్రం తిప్పనుంది. ఇప్పటికే కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృత్రి హాసన్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ మూడు భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్షరకు తమిళంలో ఆఫర్లు వస్తుండడం ఆసక్తిగా మారింది.
 
ప్రస్తుతం తాజా సమాచారం ఏమిటంటే.. గత కొంత కాలంగా మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్. ఈ యంగ్ హీరో గతంలో నటించిన సండకోళి. తెలుగు పందెం కోడి పేరుతో విడుదలై, రెండు భాషల్లోను మంచి హిట్టు సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని 'పందెం కోడి' సీక్వెల్‌కి శ్రీకారం చుట్టాడు. గతంలో వచ్చిన సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన లింగుస్వామినే రంగంలోకి దింపాడు.
 
ఈ చిత్రంలో కథానాయికగా అక్షర హాసన్‌ని తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు లింగుస్వామి తెలిపారు. నిన్న, మొన్నటి వరకు ఈ సినిమాలో విశాల్‌కు జోడీగా షామిలి నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని విశాల్ తేల్చి చెప్పాడు. తాము అక్షరహాసన్‌ని సంప్రదించామనీ, అయితే ఆమె నుంచి ఇంకా బదులు రాలేదని అన్నారు. మరి అమ్మడు విశాల్ సరసకు ఓకే అంటుందో లేదో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments