Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ ప్రారంభమైన `ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్‌`

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (14:16 IST)
Allu aravind, gopichand
ప్ర‌తిరోజు పండ‌గే సినిమా త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేయ‌బోయే సినిమా పై అంతటా ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్,  యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీవాసు నిర్మాత‌గా నిర్మిస్తున్న చిత్రం `పక్కా కమర్షియల్`. గోపీచంద్ హీరో. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌ణ‌ల‌ను సైతం ద‌ర్శ‌కుడు మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చారు. ఈ చిత్ర విడుదల తేదీని కార్టూన్ క్యారకేచ‌ర్లు వాడుతూ వినూత్నంగా ప్ర‌క‌టించ‌డం కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

maruti, gopinchand, etc
తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ క్వార్టర్స్ లో మొదలైంది. ఈ సినిమాతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జి ఏ2 పిక్చర్స్, యూ వి క్రియేషన్స్ లో భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతిరోజు పండుగ తో హాట్రిక్ రాగా ఇప్పుడు డబల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది, ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు, ఎస్ కే ఎన్ సహ నిర్మాత‌. ఇందులో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌ణ రానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియ జేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments