Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:28 IST)
Shiva Kandukuri
శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కొవ్వూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. పి19లో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా చవన్ ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. జూన్ నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
 
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ "శివ కందుకూరి పాత్ర సినిమా మెయిన్ పిల్లర్స్ లో ఒకటి. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో అతను కనిపిస్తారు. సీతారామ్ ప్రసాద్ మంచి కథ చెప్పారు. దానికి చవన్  ప్రసాద్ న్యాయం చేయగలుగుతారని అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాకు 'జాతిరత్నాలు' ఫేమ్ సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'హిట్', 'కృష్ణ అండ్ హిజ్ లీల' తదితర హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేసిన గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేయనున్నారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్  పాకాల సంగీతం అందిస్తున్నారు. మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. జూన్ నెల నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కొడైకెనాల్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు.
 
శివ కందుకూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్‌నర్: టికెట్ ఫ్యాక్టరీ, కథ: సీతారామ్ ప్రసాద్, ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్ (జాతిరత్నాలు), కూర్పు: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ప్రొడక్షన్ కంట్రోలర్: సాయిబాబు వాసిరెడ్డి, దర్శకత్వం: చవన్ ప్రసాద్, నిర్మాణ సంస్థ: పి19 ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి, సహ నిర్మాత: నభిషేక్, నిర్మాత: సురేష్ రెడ్డి కొవ్వూరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments