Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

దేవి
బుధవారం, 5 మార్చి 2025 (17:41 IST)
Pourusham Movie team
పౌరుషం - ది మ్యాన్‌హుడ్' సినిమా మార్చ్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.
 
షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా "పౌరుషం - ది మ్యాన్‌హుడ్".  UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ వంటి వారు నటిస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం షేరాజ్ మెహ్దీ అందించారు. డివి ప్రభు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. 
 
 హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు షెరాజ్ మెహ్ది మాట్లాడుతూ..* 'ఇది నా మనసులోంచి వచ్చిన కథ. ఈ సినిమాలో సీన్స్, యాక్షన్స్, ఎమోషన్స్ నిద్రలో లేపి అడిగినా చెప్తాను. అంత బాగా తెలుసు. ఇంతకు ముందు 8 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసాను. ఇది తొమ్మిదో సినిమా. నిర్మాతలు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నిర్మాత అశోక్ సర్ కి థ్యాంక్యూ. నేను ఇవ్వాళ సినిమా తీయగలిగాను అంటే అశోక్ సర్ వల్లే. ఇది నేను నా కళ్ళతో చూసిన కథ. ఒకరి వల్ల మంచి వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనే మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. అలాగే కమర్షియల్ సినిమా కూడా. సినిమాలో రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్ని ఉన్నాయి. 
 
హీరోయిన్ కనికా చాలా డిసిప్లీన్ అమ్మాయి. చాలా బాగా నటించింది. నటి మధి చిన్న ఏజ్ లోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. రవి వర్మ, సుమన్ తల్వార్, జబర్దస్త్ నటీనటులు.. అందరు నటీనటులు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ సినిమా ప్రతి అమ్మాయికి అంకితం. మార్చ్ 8 ఉమెన్స్ డే. ఒక రోజు ముందే ఇది రిలీజవుతుంది. ప్రపంచంలో ఆడవాళ్లు లేకుండా మగవాళ్ళు లేరు. వాళ్ళ సపోర్ట్ తో మనం ముందుకెళ్లాలి అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ పౌరుషం సినిమా. పౌరుషంగా ఉంటుంది. ఇది అందరూ థియేటర్ కి వెళ్లి చూడాలి' అని అన్నారు. 
 
నిర్మాత అశోక్ ఖుల్లార్ మాట్లాడుతూ..* 'సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కంటెంట్ ఇస్తున్నాం. మార్చ్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. అందరూ థియేటర్స్ కి వచ్చి ఈ సినిమా చూడండి' అని అన్నారు.  
 
నటుడు గంగాధర్ మాట్లాడుతూ..* 'ఈ సినిమాలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో నటించాను. సుమన్ గారికి కొడుకుగా నటించాను. ఆమని గారు ఇందులో మంచి మెసేజ్ ఇచ్చారు. పిల్లలు ఎలా ఉండాలి చెప్పారు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అన్నారు. కానీ హీరో శివ తాండవం చేశారు. ఇందులో సైన్స్, దేవుడు వేరు కాదు రెండూ ఒకటే అనే పాయింట్ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు' తెలిపారు. 
 
నటి కుష్బూ జైన్, కనిక మాట్లాడుతూ,  ఇంత మంచి సినిమాలో ఒక మంచి పాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి. అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments