Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ లోకి "ఫిలిమ్" ఓటీటీ ఎంట్రీ, తొలి ప్రీమియర్ ఏ సినిమానో తెలుసా..?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (22:09 IST)
టాలీవుడ్ లోకి ఫిలిమ్ పేరుతో మరో ఓటీటీ ప్లాట్ఫామ్ రాబోతోంది. ఫిలిమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ రాకతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం అందుబాటులోకి రానుంది. ఫిలిమ్ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇండిపెండెంట్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇతర ఓటీటీలతో పోల్చితే ఫిలిమ్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు తక్కువగా ఉంటాయని ఈ ఓటీటీ చెబుతోంది.
 
కొంతమంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కలిసి ఫిలిమ్ ఓటీటీని తీసుకొస్తున్నారు. విజయదశమి పండగ ముందు ఫిలిమ్ ఓటీటీ లాంఛ్ అవుతోంది."ఫిలిమ్" ఓటీటీలో విజయ్ సేతుపతి నటించిన "పిజ్జా 2", మమ్ముట్టి నటించిన "రంగూన్ రౌడీ", ప్రియమణి "విస్మయ" వంటి అనేక ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీ లు ప్రీమియర్ కానున్నాయి.
 
"ఫిలిమ్" ఓటీటీలో విజయ్ సేతుపతి "పిజ్జా 2" సినిమా తొలి చిత్రంగా ప్రీమియర్ కానుంది. పిజ్జా 2 సినిమాను దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించారు. గాయత్రి నాయికగా నటించింది. సోనియా దీప్తి, మహిమా నంబియార్ ఇతర పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన పిజ్జా 2 ఫిలిమ్ ఓటీటీలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వనుంది. ఈ ఓటీటీలో రిలీజ్ కాబోయే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వాటి విడుదల తేదీలు, పాటలు, టీజర్, ట్రైలర్స్ అన్నీ "ఫిలిమ్" యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments