Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (08:44 IST)
యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల 2025 వేడుక అట్టహాసంగా జరుగుతోంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ 97వ అకాడెమీ అవార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణుల ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
ఆస్కార్ అవార్డుల వేడుకకు వచ్చిన అతిథులతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్ బర్గ్ చిట్ చాట్ నిర్వహిస్తూ ఆడిటోరియం ప్రాంగణానికి సందడి సందడి చేశారు. అరియానా గ్రాండే, సింథియా, ఎరివో, డోజా క్యాట్, లిసా, క్వీన్ లతఫా, రేయ్‌లు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఆలరించారు. 
 
అయితే, ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్ సొంతం చేసుకున్న అనూజ చిత్రానికి నిరాశ ఎదురైంది. ఆ కేటగిరీలో ఐ యామ్ నాట్ ఏ రోబో ఉత్తమ లఘు చిత్రంగా అకాడెమీ అవార్డును సొంతం చేసుకుంది. 
 
ఆస్కార్ విజేతలు వీరే.. 
ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి : జోయా సాల్దాన్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్ ప్లే : అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కాన్‌క్లేవ్ (పీటల్ స్ట్రాగన్)
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైల్ : ది సబ్‌స్టాన్స్
ఉత్తమ సౌండ్ : డ్యూన్ : పార్ట్ 2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : డ్యూన్ : పార్ట్ 2
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్  ఫిల్మ్ : ఐయామ్ నాట్ ఏ రోబో 
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : నో అదర్ ల్యాండ్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ఇన్ ది షాడో ఆఫఅ సైప్రెస్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

పార్టీ మారే డీఎన్ఏ తన రక్తంలోనే లేదు : డీకే శివకుమార్

Janasena: పిఠాపురంలో జనసేన వ్యవస్థాపక దినోత్సవం- సమన్వయ కమిటీ సభ్యులు వీరే

అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

ప్రేమకు అడ్డుగా ఉందని యువతి తల్లిపై ప్రేమోన్మాది దాడి.. గొంతు పిసికి చంపడానికి యత్నం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments