Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతిక మేడమ్... మీ భర్త సూర్యను ఒక్క రోజు అప్పుగా ఇస్తారా? నెటిజన్ ప్రశ్నతో షాక్!!

వరుణ్
ఆదివారం, 24 మార్చి 2024 (10:50 IST)
హీరోయిన్ జ్యోతిక... కోలీవుడ్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. సూర్య అగ్ర నటుడుగా కొనసాగుతున్నారు. అదేసమయంలో పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో జ్యోతిక కూడా సినిమాలపై దృష్టికేంద్రీకరించారు. తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇటీవల సైతాన్ చిత్రంతో హిట్ కొట్టారు. దీంతో మంచి జోష్ మీద ఉన్నారు. పైగా, తన ఇన్‌స్టాలో అభిమానులతో అపుడపుడూ ముచ్చటిస్తుంటారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆమె ఓ పోస్ట్ పెట్టింద. దీనిపై ఓ లేడీ నెటిజన్ ఆసక్తికరంగా స్పందించింది. 
 
జ్యోతిక మేడమ్.. మీ భర్త, హీరో సూర్యను ఒక్క రోజు నాకు అప్పుగా ఇస్తారా? నేను గత 15 యేళ్ల నుంచి ఆయన వీరాభిమానిని మేడమ్.. ప్లీజ్" అంటూ కామెంట్ పెట్టింది. దీనిపై జ్యోతిక స్పందిస్తూ... ఆ ఒక్కటి అడక్కూ.. అదిమాత్రం కుదరదని ముక్తసరిగా తేల్చి చెప్పేశారు. జ్యోతిక పెట్టిన రిప్లైతో ఆ మహిళా అభిమాని ఆనందం కట్టలు తెంచుకుంది. "ఓ మై గాడ్.. ఆయన ఎప్పటికీ మీ వారే" అంటూ రిప్లై ఇచ్చింది. 
 
అయితే, అసలు ఆ నెటిజన్‌ ఆ విధంగా ఆడగటానికి కారణం లేకపోలేదు. పదిహేనేళ్ల క్రితం జ్యోతిక, సూర్య కలిసి 'నువ్వు నేను ప్రేమ' అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో కథ రీత్యా జ్యోతిక.. ఒక రోజుపాటు సూర్యని ఆయన మాజీ ప్రియురాలి వద్దకు పంపిస్తుంది. ఆ సన్నివేశం గుర్తు చేస్తూ నెటిజన్‌ ఆ కామెంట్‌ పెట్టిందన్నమాట. దానికి జ్యోతిక కూడా స్పాంటేనియస్‌గా స్పందించడంతో ప్రస్తుతం అది సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments