Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 6న అంటే సుందరానికి చిత్రం నుంచి మొదటి సింగిల్ పంచెకట్టు

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (17:32 IST)
Nani-poster
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి`. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. ఈ సంద‌ర్భంగా మొదటి సింగిల్ పంచెకట్టును ఏప్రిల్ 6న సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
 
ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో నాని, తన విదేశీ పర్యటన USAలోని సుందరమైన లొకేషన్‌లను ఆస్వాదిస్తూ, కారుడోర్‌లోంచి తల బయట పెట్టుకుని ఆశ్చ‌ర్యంగా పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాగా, ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ వ‌చ్చింది.
 
నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది  ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు లీలా థామస్.
 
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అంటే సుందరానికి జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
 
రచయిత, దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని & రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
మ్యూజిక్ కంపోజర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
PRO: వంశీ శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments