Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎం.జి.శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'ఆన్ ఎయిర్' చిత్రం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (07:56 IST)
కన్నడంలో ఎం.జి.శ్రీనివాస్ (శ్రీని) పరిచయం అక్కర్లేని పేరు. హీరోగా, దర్శకుడిగా కన్నడంలో బీర్బల్ ట్రైయాలజీ, ఓల్డ్ మోంక్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సంచలనం సృష్టించిన ఆయన మరో విభిన్న థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'ఆన్ ఎయిర్' అనే ఇంటరెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీని ఆర్ జేగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 
 
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ ప్రశాంత్ సాగర్ 'ఆన్ ఎయిర్'కు దర్శకత్వం వహించగా వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రఘువీర్ గోరిపర్తి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, చిత్ర కథ ఎంతో వినూత్నంగా ఉండి ప్రేక్షకులకు ఒక విభిన్నమైన చిత్రం చూడబోతున్నాం అనే అంచనాలు ఏర్పరిచింది.
 
ఏంజీ.శ్రీనివాస్ ఆర్ జేగా నటిస్తున్న ఈ చిత్రంలో, ఆర్జేగా తన మొదటి రోజే వచ్చిన ఒక కాల్‌తో తన జీవితంలో ఎలాంటి పెను మార్పులు చోటుచేసుకున్నాయి అని ఒక వినూత్నమైన స్క్రీన్ ప్లేతో ఎంతో ఉత్కంఠగా ఆన్ ఎయిర్ తెరకెక్కింది. శ్రీని పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన అద్భుత నటనతో ఈ థ్రిల్లర్‌ను ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లారు. ఆన్ ఎయిర్ ఎంతో బలమైన కంటెంట్‌ను కలిగి ఉండి అంతే స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందింది. 
 
జూలై 9న శ్రీని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆన్ ఎయిర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. గ్లింప్ల్స్ చిత్ర మూడ్‌ను తెలియజేసే విధంగా ఉంటూ హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎంతో ఆకట్టుకుంటోంది.
 
దర్శక నిర్మాతలు ఆన్ ఎయిర్ ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లడం ఖాయం అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ సాగర్ 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పకడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. 
 
రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఏ మాత్రం రాజీ పడకుండా టాప్ క్లాస్ ప్రొడక్ట్ ఇవ్వాలని ఆన్ ఎయిర్ ను నిర్మిస్తున్నారు. చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవనుంది. అతి త్వరలో ఒక టాప్ ఓటిటి ప్లాట్ఫారంలో ఈ చిత్రం విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments