Webdunia - Bharat's app for daily news and videos

Install App

#OhBabyTrailer "ఓ బేబి.. ఎంత సక్కగున్నావే".. అదరగొట్టేసిన అక్కినేని ఇంటి కోడలు.. (Video)

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (12:20 IST)
సమంత అక్కినేని మజిలీ సినిమాకు తర్వాత ఓ బేబి అంటూ ముందుకు వస్తోంది. తన భర్త నాగచైతన్యతో కలిసి మజిలి చిత్రంలో నటించింది. పెళ్లికి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఇది.

శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో కొరియన్ సినిమా అయిన "మిస్ గ్రానీకి" రీమేక్‌గా తెరకెక్కే చిత్రంలో సమంత అదరగొట్టింది.
 
ఈ సినిమాకి "ఓ బేబి.. ఎంత సక్కగున్నావే" అనే టైటిల్‌ని పెట్టారు. నాగ శౌర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్‌పై సురేష్ బాబు అలాగే గురు ఫిలిమ్స్ పై సునీతా తాటి ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
 
ఇకపోతే.. ఈ చిత్రం 70 ఏళ్ల బామ్మ.. 24 ఏళ్ల పడుచు అమ్మాయిలా మారితే ఎలా ఉంటుంది? ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? చుట్టూ ఉన్న సమాజంతో ఆమె సెట్ కాగలదా? వంటి వెరైటీ కాన్సెప్టులో సమంత అదరగొట్టేసింది. తాజాగా విడుదల ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. వెరైటీ రోల్స్‌లో సమంత అదరగొట్టేసింది. 
 
ఇకపోతే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 5న రిలీజవుతోంది ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజై దుమ్మురేపుతోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ ప్రోమోస్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇంకేముంది..? ఓ బేబీ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!! (Video)

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments