సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "ఆఫీసర్". స్టైలీష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "ఆఫీసర్". స్టైలీష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ బాగానే ఉంది కానీ... ఇంకా ఏదో కావాలి.. ఇందులో ఏదో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ కలిగించింది. ఇదే విషయం గురించి ఆఫీసర్ టీమ్‌ని అడిగితే... టీజర్‌ని అలా కావాలని కట్ చేశా. టీజర్ అద్భుతంగా ఉంటే... సినిమాపై అంచనాలు పెరిగిపోతాయ్. అందుచేత మా ప్లాన్‌లో భాగంగానే టీజర్‌ని అలా కట్ చేశామని చెప్పారు.
ఇదిలావుంటే... ఊహించని విధంగా రామ్ గోపాల్ వర్మ నటి శ్రీరెడ్డి - హీరో పవన్ కళ్యాణ్ వివాదంలో చిక్కుకోవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. దీంతో అసలు 'ఆఫీసర్' సినిమా రిలీజ్ అవుతుందా..? రిలీజ్ అయితే.. పవన్ ఫ్యాన్స్ వర్మ సినిమా కాబట్టి అడ్డుకునే అవకాశం ఉంది కదా..? సో.. సినిమా రిలీజ్ వాయిదా వేస్తారా..? లేక ఎనౌన్స్ చేసినట్టుగా మే 25నే రిలీజ్ చేస్తారా..? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పవన్‌కి మద్దతు తెలియచేశారు. వర్మ ప్రియ శిష్యుడు అయిన పూరి జగన్నాథ్ కూడా పవన్‌కే నా మద్దతు అని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. కానీ... హీరో నాగార్జున మాత్రం సైలెంట్‌గా మిన్నకుండిపోయారు. దీంతో 'ఆఫీసర్' చిత్ర యూనిట్ సభ్యుల మధ్య అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా, అక్కినేని వంశాభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారట. మరి... 'ఆఫీసర్'గా నాగార్జున ఎపుడు ప్రేక్షకుల ముందుకు వస్తారో వేచిచూడాల్సిందే.