Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ్ రామ్ నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ చిత్రం ప్రారంభం

'జనతా గ్యారేజ్' చిత్రంతో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కనుంది. పవర్ సినిమాతో డైరెక్టర్‌గా కె

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (13:28 IST)
'జనతా గ్యారేజ్' చిత్రంతో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కనుంది. పవర్ సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం శుక్రవారం ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. 
 
నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ, దర్శకులు వి.వి.వినాయక్, దిల్ రాజు, శిరీష్, భోగవల్లి ప్రసాద్, యలమంచిలి రవి శంకర్, కిలారు సతీష్, ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగ వంశి తదితరులు పూజా కార్యక్రమానికి విచ్చేశారు. తొలి షాట్‌కి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దేవుడి పఠాలపై తొలి షాట్‌కు వి.వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా రాశీ ఖన్నాను ఇప్పటికే ఖరారు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి సి.కె.మురళీధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్' చిత్రాలతో భారీ హ్యాట్రిక్‌ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్‌తో ఈ నూతన చిత్రంలో కనిపించనున్నారు. 
 
నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... "సోదరుడు ఎన్టీఆర్‌తో, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై "ఎన్టీఆర్27" చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్‌లోని స్టార్‌కి, నటుడుకి న్యాయం చేసే విధంగా ఉంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ ఈనెల 15వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభంకానుందని చెప్పారు. 
 
ఈ యేడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాయని చెప్పారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments