Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో పవర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీయార్

Webdunia
గురువారం, 20 మే 2021 (12:11 IST)
NTR- still
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా నందమూరి కల్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఖ‌రారైన‌ట్లు గురువారం ఉద‌య‌మే కొర‌టాల టీమ్ ఎన్‌.టి.ఆర్‌.కు శుభాకాంక్ష‌లు తెల‌పుతూ ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది.
 
షూటింగ్, నటీనటుల గురించి వివరాలు త్వ‌ర‌లో వెల్లడించనున్నారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా దర్శకుడు కొరటాల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌‌కు బ్రేక్ ఇచ్చారు. కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని జూనియర్ ఎన్‌టిఆర్‌తో తన రాబోయే చిత్రం కోసం ఉపయోగిస్తున్నారట కొరటాల. ఈ చిత్రాన్ని ఎమోషనల్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారట. కొరటాల అన్ని చిత్రాలలాగే ఎన్‌టిఆర్ 30లోనూ ఒక సామాజిక అంశం ఉండబోతోందట. తాజా సమాచారం ప్రకారం తారక్ కోసం ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రను కొరటాల రాస్తున్నారట. 
 
ఎన్టీఆర్ ఇందులో పవర్ ఫుల్ విప్లవాత్మక నాయకుడి పాత్రను పోషిస్తారని తెలుస్తోంది. ఇక 'జనతా గ్యారేజ్' భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. వెండితెరపై ఈ క్రేజీ కాంబినేషన్‌‌లో మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాకింగ్ వెళ్లిన దంపతులను తరుముకున్న గజరాజు.. ఎక్కడ?

ఐఏస్ ఆమ్రపాలిపై తెలంగాణ సర్కారుకు ఎందుకో అంత ప్రేమ?

వివాహిత మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం- సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై కేసు

వ్యక్తి ప్రాణం తీసిన ఆవు.. ఎలా? వీడియో వైరల్

ఇంట్లోనే కూతురిని పూడ్చి పెట్టిన కన్నతల్లి.. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments