Webdunia - Bharat's app for daily news and videos

Install App

#NTRBiopic : సోదరా దుశ్శాసనా... మామా గాంధార సార్వభౌమా...

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించే చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్‌ను ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టి ప్రారంభిం

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (10:48 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించే చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్‌ను ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టి ప్రారంభించగా, దర్శకుడు బోయపాటి శీను తొలి షాట్‌కు దర్శకత్వం వహించాడు. ప్రత్యేకంగా వేసిన 'దాన వీర శూర కర్ణ' సినిమా సెట్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
 
తొలి షాట్‌గా కర్ణుడిని రాజ్యాభిషిక్తుడను చేసే సీన్‌ను చిత్రీకరించారు. ఇందులో కోట శ్రీనివాసరావు ధృతరాష్ట్రుడి పాత్రలో కనిపించగా, జీవి తదితర నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించారు. 'ఓహో... రాచరికమా అర్హతను నిర్ణయించునది. సోదరా దుశ్శాసనా... మామా గాంధార సార్వభౌమా... పరిజనులారా... పుణ్యాంగనులారా' అనే సూపర్ హిట్ డైలాగును తనదైనశైలిలో హీరో బాలకృష్ణ చెప్పారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేస్తున్న విషయం తెల్సిందే. 
 
అంతకుముందు ఈ చిత్రానికి ఎంజీఆర్ వేషధారణలో వచ్చిన నటుడు ఒకరు క్లాప్ కొట్టారు. ఎన్టీఆర్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన 'దాన వీర శూర కర్ణ' ముహూర్తపు షాట్‌గా చిత్రీకరించారు. 1976లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్ ప్రత్యేక అతిథిగా వచ్చి క్లాప్ కొట్టగా, గురువారం ఎంజీఆర్ వేషం వేసుకున్న నటుడు వచ్చి క్లాప్ కొట్టగా, దుర్యోధనుడి వేషంలో ఉన్న బాలయ్య, తన మీసం మెలేస్తూ, డైలాగ్ చెప్పుకుంటూ వెళ్లారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments