Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బాలకృష్ణ!

యువరత్న నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అది రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని బాలయ్య

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (12:48 IST)
యువరత్న నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అది రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని బాలయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
 
ఈ సినిమాకు బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరును తాజాగా సందర్శించింది. అక్కడ ఎన్టీఆర్ చిన్ననాటి విశేషాలను డైరెక్టర్ కొందరి ద్వారా తెలుసుకున్నారు.
 
నవంబర్ మొదటి వారంలో నిమ్మకూరులో షూటింగ్ జరగనుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన అనంతరం జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి సీఎం అయ్యే సందర్భంలో ఒకసారి.. అనంతరం నాదెండ్ల భాస్కరరావుని సీఎంగా దించిన తర్వాత మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భం ఒకటి. 
 
ఈ రెండు సన్నివేశాలను ఈ సినిమాలో ముఖ్యంగా చూపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.. కొన్ని కీలక పాత్రల్లో రానా దగ్గుబాటి, మోహన్ బాబు, సుమంత్ తదితరులు నటిస్తున్నారు.
 
ఎన్టీఆర్ బయోపిక్ : సీఎంగా బాలకృష్ణ.. 
నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ షూటింగ్ 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments