Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్... నటి మమతా కులకర్ణికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్....

బాలీవుడ్ నటి మమతా కులకర్ణి మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాల కేసులో ఈమె పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ స్మగ్లర్ వికీ గోస్వామితో పాటు మమతా కులకర్ణికి నాన్ బెయిలబుల్ వారెంటును థానే కోర్టు జారీ చేసింది

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (15:38 IST)
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాల కేసులో ఈమె పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ స్మగ్లర్ వికీ గోస్వామితో పాటు మమతా కులకర్ణికి నాన్ బెయిలబుల్ వారెంటును థానే కోర్టు జారీ చేసింది. కాగా ఈ కేసు వెలుగులోకి రాగానే మమత కులకర్ణితో సహా గోస్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇద్దరూ అలా వెళ్లిపోవడంతో పెళ్లి చేసుకుని వుంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. 
 
కాగా డ్రగ్స్ రాకెట్ కేసులో మమతా కులకర్ణి పాత్ర వున్నదనేందుకు బలమైన ఆధారాలున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు మమతతో పాటు గోస్వామిని అరెస్టు చేయాలని ఆదేశించింది. కెన్యా, భారత్ కేంద్రాలుగా మమత-గోస్వామి ఇద్దరూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పక్కా ఆధారాలున్నాయని న్యాయవాది చూపడంతో కోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఐతే మమతా కులకర్ణి ఇప్పుడు ఎక్కడ వున్నది తెలియడంలేదు. ఆమె కెన్యాలో వున్నదని అనుమానం. ఎందుకంటే కెన్యా మాదకద్రవ్యాలకు ప్రధాన కేంద్రంగా వుంటున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments