Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ ఖాన్‌కు మద్దతిచ్చిన పూరీ, వెంకీ: పనికిరానివాళ్లకి.. ఆ గట్స్ ఉందా?

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (16:07 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్‌పై ఎంతో మంది విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అమీర్ ఖాన్ వివరణ ఇచ్చినా విమర్శకుల నోర్లు ఏమాత్రం మూతపడట్లేదు. సోషల్ మీడియాలో అమీర్ ఖాన్‌పై లేనిపోని విమర్శలు, సెటైర్లు విసురుతూ కాలం గడిపేస్తున్నారు. అలాంటి వారిని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఏకిపారేశాడు. అమీర్ ఖాన్‌కు పూరీ మద్దతు తెలిపాడు. 
 
పనికిమాలినవాళ్లంతా అమీర్ ఖాన్‌పై మండిపడుతున్నారని దుయ్యబట్టాడు. అమీర్ ఖాన్ సెలబ్రిటీ కావడంతోనే పనికిమాలినవాళ్లంతా ఆయనపై కామెంట్స్ చేస్తున్నారని, అదే అమీర్ ఖాన్ అల్‌ఖైదానో, ఐసిస్‌లో సభ్యుడైతే.. ఏ భారతీయుడైనా అతనిపై విమర్శించే గట్స్ కలిగివున్నాడా? అంటూ ప్రశ్నించాడు. 
 
అమీర్ సెలెబ్రిటీ కావడంతోనే ఇలాంట్ నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డాడు. అమీర్ ఖాన్ బాధను ఎవరూ అర్థం చేసుకోవడంలేదని.. ప్రతి ఒక్కరు వివాదాలు సృష్టించడంలో బిజీగా ఉన్నారంటూ పూరీ జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ఇమేజ్‌ను కూడా పూరీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
 
మరోవైపు విక్టరీ వెంకటేష్ కూడా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌కు మద్దతు పలికారు. దేశంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments