Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీలో ఒంటరివాడైన హీరో ఎవరు?

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫ్లాపులలో చిక్కుకుని విలవిలా కొట్టుకుంటున్నాడు. 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం', 'జవాన్', 'ఇంటెలిజెంట్' ఇలా వరుస ఫ్లాపులతో ముందుకు వెళ్ళలేక తెగ బాధపడ

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (11:52 IST)
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫ్లాపులలో చిక్కుకుని విలవిలా కొట్టుకుంటున్నాడు. 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం', 'జవాన్', 'ఇంటెలిజెంట్' ఇలా వరుస ఫ్లాపులతో ముందుకు వెళ్ళలేక తెగ బాధపడిపోతున్నాడు. మొదట్లో మూడు వరుస హిట్లను సాధించిన సాయిధరమ్ తేజ్ ఆ తర్వాత ఫ్లాప్‌లే ఎక్కువగా మూటగట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్‌ను ఇండస్ట్రీలో అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, దీని వెనుక కొందరు బడా వ్యక్తులు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో ముందుకు తీసుకెళదామనుకున్న వారే ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లను మూటగట్టుకోవడంతో చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి సాయి ధరమ్ మెగా ఫ్యామిలీ బ్రాండ్‌తోనే నెట్టుకొస్తున్నాడు. అయితే కొన్నిరోజులుగా కొంత మంది నిర్మాతలతో సాయి ధరమ్ తేజ్ సఖ్యతగా లేకపోవడంతో ఆ నిర్మాతలందరూ సాయి ధరమ్ తేజ్‌కు వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకులెవరైనా మంచి కథను సిద్ధం చేసినా సాయి ధరమ్ తేజ్ వద్దకు వెళ్ళకుండా నిర్మాతలు ఆపేస్తున్నారట. 
 
మొదటి నుంచి పవన్ కళ్యాణ్ సపోర్ట్ సాయి ధరమ్ తేజ్‌కు ఎక్కువగా ఉండేది. అయితే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సాయి విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక చిరంజీవి అంటారా.. ఆయన సినిమాల గురించే ఆలోచించుకుంటున్నారు. నాగబాబు విషయానికొస్తే ఆయన కుమారుడు వరుణ్‌ తేజ్‌‌కు లైఫ్ ఇచ్చేందుకు కృషి చేస్తుంటారు. ఇలా ఎవరి పనిలో వారిలో బిజీగా ఉండడంతో మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్ ఏకాకిగా మారి చివరకు ఫ్లాప్‌లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందట. ఈ వ్యవహారంపై ఫిల్మ్ నగర్‌లో జోరుగానే చర్చలు జరుగుతున్నాయట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

కాకినాడ SEZ కేటాయింపులు: విజయసాయి రెడ్డికి ఈడీ కొత్త నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments