Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్య‌వ‌స్థ‌ లోపం వ‌ల్ల అర్హ‌త‌కు త‌గిన ప‌ని ఎవ‌రూ చేయ‌డంలేదు - గాడ్సే హీరో స‌త్య‌దేవ్‌

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (17:10 IST)
Satyadev
హీరో స‌త్య‌దేవ్ న‌టించిన సినిమా `గాడ్సే`. బ్ల‌ఫ్ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మాజంలో ముఖ్యంగా విద్యావిధానం వ‌ల్ల నిరుద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, ప‌రిష్కార నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని సి. క‌ళ్యాణ్ నిర్మించారు. ఈనెల 17న విడుద‌ల‌కాబోతున్న ఈ చిత్రం గురించి స‌త్య‌దేవ్ ఇలా తెలియ‌జేస్తున్నారు.
 
- మ‌న రాజ్యాంగంలో ఎన్నో రూల్స్ పెట్టారు. కానీ అందులో చాలామ‌టుకు ఎవ్వ‌రూ స‌రిగ్గా ఆచ‌రించ‌డంలేదు. ప్ర‌శ్నించే పౌరుడిగా నేను ఈ సినిమాలో చేసిన ప్ర‌య‌త్న‌మే గాడ్సే. గాంధీ కాలానికి చెందిన గాడ్సే క‌థ‌కు దీనికి సంబంధంలేదు. కానీ సినిమా చూశాక ఈ టైటిల్ బాగుంద‌ని మీరే అంటారు.
- నేను రూల్స్ పాటిస్తాను. కారులో వెళుతున్న‌ప్పుడు రెడ్‌లైట్ ప‌డితే ఆగిపోతాను. ట్రాఫిక్ ఏమీ లేక‌పోయినా దాన్ని ఫాలో అవుతాను. ఇలా చాలామంది ఫాలో అవుతున్నా ఎక్కువ‌మంది చూసీచూడ‌న‌ట్లుగాగా గీత దాటేస్తారు. ఇది స‌రైందికాదు.
- నాకు తెలిసి నేను కాలేజీ చ‌దివేరోజుల‌నుంచి నిరుద్యోగ స‌మ‌స్య వుంది. ఇప్ప‌టికీ ఇంకా కొన‌సాగుతుంది. వారిలో ఎటువంటి మార్పులేదు. అస‌లు ఏ చ‌ద‌వు వ‌ల్ల ఏమి  వ‌స్తుందో ఎవ‌రికీ తెలీదు. అస‌లు చ‌దువుకు, చేసే ప‌నికి పొంత‌నేలేదు.
- చాలామంది చ‌దువు అయ్యాక లైఫ్ ఎలా వుంద‌ని ప్ర‌శ్నిస్తే, దాదాపు 90శాతం మంది ఏదో ఇలా వుంది.. అంటారేగానీ ధైర్యంగా నేను చ‌దివిన‌దానికి త‌గిన ప‌ని చేస్తున్నాన‌ని ఎవ్వ‌డూ అన‌డు. దీనికి కార‌ణం ఎవ‌రు? అనేది నేను సినిమాలో ప్ర‌శ్నించా.
- మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చేయ‌డం నా డ్రీమ్‌. అది ఆచార్య‌ద్వారా నెర‌వేరింది. ఇప్పుడు తాజాగా మ‌రో సినిమాలో న‌టిస్తున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments