Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో రోజా... బెదిరింపులకు భయపడేది లేదు: రామ్ గోపాల్ వర్మ

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా నటించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సినిమాక

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (09:29 IST)
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా నటించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులపై చర్చించేందుకు పలమనేరులోని చిత్ర నిర్మాత వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి రామ్ గోపాల్ వర్మ వెళ్లారు. 
 
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. చిత్రంలోని కొన్ని పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడబోమని తెలిపారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా సినిమాను నిర్మిస్తామని తెలిపారు.  
 
రామ్ గోపాల్ వర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతీ ఎంట్రీ నుంచి ఈ సినిమా వుంటుందని చెప్పారు. ఇందులో రాజకీయ అజెండా వుండదన్నారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని.. అందులో చాలా చాప్టర్లున్నాయని.. తాను ఒక చాప్టర్‌ను ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడం నుంచి ఆయన మరణం వరకు ఈ చిత్రం వుంటుందని వర్మ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments