Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గ్యారేజ్'పై రాజకీయం... బాలకృష్ణ, లోకేశ్ తీరుపై జూ.ఎన్టీఆర్ అభిమానుల ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి వంశ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు సాగుతున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన ప్రతి సినిమా విడుదలకు ముందు చిక్కులు ఏర్పడుతున్నాయి. గతంలో 'నాన్న

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (08:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి వంశ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు సాగుతున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన ప్రతి సినిమా విడుదలకు ముందు చిక్కులు ఏర్పడుతున్నాయి. గతంలో 'నాన్నకు ప్రేమతో' విడుదలకు ముందు ఎదురైన చిక్కులే ఇపుడు కొత్తగా తలెత్తాయి. తాజాగా సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఎన్టీఆర్ సినిమా 'జనతా గ్యారేజ్' బెనిఫిట్ షోకు అడ్డంకులు కల్పించేలా తెరవెనుక రాజకీయం భారీ స్థాయిలోనే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హెచ్చరికలతో ఆ వ్యూహం ఫలించలేదు. 
 
వాస్తవానికి ఈ నెల 31 అర్థరాత్రి దాటిన తరువాత జిల్లావ్యాప్తంగా జనతా గ్యారేజ్ సినిమా 34 బెనిఫిట్ షోలు ప్రదర్శనకు అనుమతించాలని మూడు రోజుల క్రితమే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌ను డిస్ట్రిబ్యూటర్లు రాతపూర్వకంగా కోరారు. కానీ, పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతిలేదంటూ కృష్ణా జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూటర్లకు మంగళవారం ఉదయం చెప్పడంతో వివాదానికి దారితీసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరిస్తే మచిలీపట్నం కలెక్టరేట్, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయాల వద్ద ధర్నాకు దిగుతామంటూ హెచ్చరికలు పంపారు. ఇది మరో వివాదంగా టీడీపీ మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఎట్టకేలకు మంగళవారం రాత్రి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. 
 
సొంత సామాజికవర్గానికి చెందిన కొందరు ఈ వ్యవహారాన్ని మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి వద్దకు తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. సినిమా బెనిఫిట్ షో అనుమతి నిరాకరణ వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉండటంతో మంత్రులు సైతం మౌనముద్ర దాల్చినట్టు సమాచారం. చివరకు   ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకే ఈ పంచాయితీ వెళ్లింది. జూనియర్ సినిమాను అడ్డుకుంటే హీరో బాలకృష్ణ, నారా లోకేశ్ ఇలా చేశారని ప్రజలు విశ్వసిస్తారని, ఇది మంచిది కాదని సొంత సామాజికవర్గానికి చెందిన పలువురు  చెప్పినట్లు సమాచారం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments