Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెగెటివ్ రిపోర్టు రావడం వల్లే సినిమాకు వచ్చా.. నివేదా

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:58 IST)
తాను కరోనా వైరస్ బారినపడిన మాట నిజమేనని కానీ, తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చిన తర్వాతే వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్‌కెళ్లి చూసినట్టు హీరోయిన్ నివేదా థామస్ చెప్పుకొచ్చారు. 
 
కరోనా వైరస్ బారినపడిన వారిలో నివేదా థామస్ కూడా ఒకరు. అందుకే ఆమె వకీల్ సాబ్ ప్రిరిలీజ్ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో నివేదా థామస్ థియేటర్‌లో సినిమా చూస్తున్నట్టుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరస్ అయింది. కరోనాతోనే థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూసింద‌ని ఆమెపై నెటిజ‌న్స్ ఫైర్ అయ్యారు. ఒక సెల‌బ్రిటీ అయి ఉండి ఇంత బాధ్య‌తారాహిత్యంగా ఉంటావా అంటూ నివేదాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో నివేదా థామ‌స్ పూర్తి క్లారిటీ ఇచ్చింది.
 
ఏప్రిల్ మొద‌టి వారంలో నివేదా థామ‌స్‌కు క‌రోనా సోకడంతో ఆమె క్వారంటైన్‌లో ఉంది. వ‌కీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఈ కార‌ణంతోనే హాజరు కాలేక‌పోయింది. అయితే ఏప్రిల్ 10న తాను థియేట‌ర్‌లో వ‌కీల్ సాబ్ సినిమా చూస్తున్న పిక్స్ షేర్ చేసింది. దీంతో షాక్ అయిన ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. 
 
ఈ క్ర‌మంలో బ‌దులిచ్చిన నివేదా థామ‌స్.. త‌న‌కు క‌రోనా నెగెటివ్ వ‌చ్చింద‌ని, అందుకే థియేట‌ర్‌లో సినిమా చూసాన‌ని పేర్కొంది. ప్ర‌మోష‌న్ టైంలో కరోనా రావ‌డం బాధ అనిపించింది. రైట్ టైమ్‌కు నెగెటివ్ వ‌చ్చింది. మునుప‌టిలా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారన్నారు. 
 
అయితే ప్రేక్ష‌కుల రెస్పాన్స్ ఎలా ఉందో చూసేందుకు తాను థియేట‌ర్‌కు వెళ్లానంటుంది నివేదా. కోవిడ్ వ‌ల‌న ప్రేక్ష‌కుల‌ని నేరుగా క‌ల‌వ‌లేక‌పోయిన వారు పెడుతున్న పోస్ట్‌ల‌న్నింటిని చ‌దువుతున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ సినిమా రీమేక్‌లో ఈమె నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments