Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్ మూవీ హైలెట్ ఇదే, ఇక ఆ హీరోయిన్ కెరీర్ గాడిలో పడినట్టే..!

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (21:21 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఏంసీఎ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ క్రేజీ మూవీ రూపొందుతోంది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినప్పటి నుంచి మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తాడా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసారు.

అన్నయ్య చిరంజీవితో పాటు అభిమానులు కూడా సినిమాలకు గుడ్ బై చెప్పద్దు.. సినిమాల్లో నటించమని చెప్పడంతో... ఆఖరికి పవన్ వకీల్ సాబ్ మూవీతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు. 
 
ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోయిన్ నివేదా థామస్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎమోషన్‌తో సాగే ఈ పాత్రలో నివేదా థామస్ జీవిస్తుందని... ఈ పాత్ర ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఈ పాత్రలో నివేదా థామస్ అయితే కరెక్ట్‌గా పాత్రకు న్యాయం చేస్తుందని అనుకున్నాం. 
 
అనుకున్నట్టుగానే పాత్రలో లీనమై నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నివేదా థామస్‌కు మరింత పేరు వస్తుందని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక నుంచి నివేదా థామస్‌తో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని... ఇలాంటి ఆఫర్స్ మరిన్ని ఆమెకు వస్తాయి అని వార్తలు వస్తుండటంతో ఆమె పాత్రపై మరింత ఆసక్తి ఏర్పడింది. 
 
ఈ సినిమాలో డైలాగులు విషయానికి వస్తే, ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా ఉంటాయని... ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చెప్పే వపర్‌ఫుల్ డైలాగులు మాస్‌ని విశేషంగా ఆకట్టుకుంటాయని.. లీకైన డైలాగును బట్టి తెలుస్తుంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. 
 
ఈ పాట ఓ రేంజ్‌లో ఉంటుందని.. అభిమానులు పండగ చేసుకునేలా ఈ పాటకు థమన్ ట్యూన్స్ ఇస్తున్నారని తెలిసింది. ప్రజెంట్ హైదరాబాద్‌లో ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బోనీకపూర్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మే 15న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments