Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నితిన్‌ కొత్త చిత్రం ప్రారంభం...

నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆ

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (17:47 IST)
నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'అ ఆ' వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత యూత్‌స్టార్‌ నితిన్‌ చేస్తున్న మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, ప్రముఖ నిర్మాత, హీరో నితిన్‌ తండ్రి ఎన్‌.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. 
 
హీరో నితిన్‌, చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని దర్శకుడు హను రాఘవపూడికి అందించారు. నవంబర్‌ ద్వితీయార్థంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ ప్రారంభంలో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ''ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. నితిన్‌తో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేయడం చాలా సంతోషంగా వుంది. అందర్నీ ఆకట్టుకునే చక్కని ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో 'కృష్ణగాడి వీరప్రేమగాథ' తర్వాత చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది'' అన్నారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments