Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ళ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (15:40 IST)
టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్. ఈమె బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అవేం ఫలించలేదు. దీంతో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి దక్షిణాది భాషలపైనే దృష్టి కేంద్రీకరించాలని భావించింది. 
 
నిజానికి ఈ భామ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయింది. అయినప్పటికీ ఒక్క హిందీ చిత్రంలో కూడా నటించలేక పోయింది. దక్షిణాదిలో ప‌లు బాష‌ల‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. 
 
ఈ నేపథ్యంలో 'ప్రాణ' అనే బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఈ చిత్రంలో నటించాలని ఆమె నిర్ణయం తీసుకుంది. ఏకకాలంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం ఒకే ఒక్క పాత్రతో వీకే ప్రకాశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
సామాజిక సమస్యలపై పోరాడే రచయిత్రిగా నిత్య కనిపించనున్నారు. 'ప్రాణ' చిత్రం హిందీలో కూడా రిలీజ్‌ అవ్వబోతోంది. హిందీలో ఇదే నా ఫస్ట్‌ సినిమా అవ్వనుంది అంటూ ప్రాణ మూవీ హిందీ పోస్టర్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న ఆనందం తెలియ‌జేసింది. 
 
థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఇండియా టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. లూయిజ్ బ్యాంక్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ యేడాది చివర్లో 'ప్రాణ' చిత్రం రిలీజ్‌ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments