Webdunia - Bharat's app for daily news and videos

Install App

సావిత్రి పాత్రను ఎందుకు చేయలేక పోయానంటే : నిత్యా మీనన్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది.

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (13:21 IST)
ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, సమంత, అనుష్క వంటి మరికొంతమంది అగ్రనటులు నటిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం తొలుత హీరోయిన్ నిత్యామీనన్‌కే వచ్చిందట. కానీ ఆమె ఓ చిన్న కారణంతో అంగీకరించలేక పోయిందట. దీనిపై ఆమె స్పందిస్తూ, మహానటిలో సావిత్రి పాత్ర చేసే అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం 'ప్రాణ' అనే చిత్రాన్ని నాలుగు భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు. అందుకే రైటింట్‌ సైడ్‌ కూడా నేను సహకారం అందించాను. నాలుగు భాషల్లో చేసినా అందులో ఒకే ఒక పాత్ర మాత్రమే కనపడుతుంది. సింక్‌ సౌండ్‌లో సినిమాను చేస్తున్నాం. కేరళలోని హిల్‌ స్టేషన్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. నాలుగు భాషలను వేర్వేరుగా చేశాను. ఈ సినిమాను 23 రోజుల్లోనే పూర్తి చేసినట్టు నిత్యా మీనన్ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments