Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైసీ స్థానంలో నిత్యా మీనన్.. జక్కన్న నుంచి పిలుపు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:06 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్, బ్రిటీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, తన వ్యక్తిగత కారణాల రీత్యా డైసీ ఈ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కొత్త హీరోయిన్ కోసం దర్శకుడు అన్వేషణ మొదలు పెట్టారు. 
 
ఈ క్రమంలో పలువురు పేర్లు వినిపించాయి. ముఖ్యంగా, బాలీవుడ్ నటీమణులు శ్రద్ధా కపూర్‌ లేదా అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్‌ల పేర్లను రాజమౌళి పరిశీలించినట్టు తేలింది. కానీ, ఇపుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు నిత్యామీనన్. ఆమెకు రాజమౌళి నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.
 
దీంతో లుక్‌ టెస్ట్‌ కోసం ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. అయితే ఆమె ఎన్టీఆర్‌కు జోడీగా నటించబోతున్నారా? లేదా మరేదైనా కీలకమైన పాత్ర కోసం జక్కన్న సంప్రదించారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
 
కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌ చరణ్‌‌, కొమరం భీమ్‌గా తారక్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి అలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం‌.ఎం‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments