Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యభర్తలు అంటే ఒకరి గురించి ఇంకొకరు బతకాలి : జీవిత రాజశేఖర్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (16:45 IST)
Jeetha, Rajasekhar
నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈసినిమాలో రాజశేఖర్ కూడా నటించారు. తన పాత్ర గురించి రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘నన్ను ఒకసారి సడెన్‌గా పిలిచారు. ఈ కథ చెప్పారు. నన్ను కన్విన్స్ చేశారు. స్పెషల్ అప్పియరెన్స్ పాత్రను చేశాను. నాకు నచ్చింది. బాగుందని చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, నితిన్‌కు థాంక్స్. జీవిత చెబితే నేను వింటాను అని అంతా అనుకుంటారు. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది. ఆమె నా మంచికే చెబుతుంటుంది కాబట్టి ఏం చెప్పినా నేను వింటాను. తెరపై జాలీగా, ఆకతాయిగా నటిస్తారు కదా? సెట్‌లోనూ అలానే ఉంటారని అనుకున్నాను. కానీ సెట్స్ మీద హీరోగా, నిర్మాతగా ఎంతో బాధ్యతతో ఉండేవారు. దర్శకుడు నన్ను బాగా చూపించారు’ అని అన్నారు.
 
జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. మంచి పాత్ర దొరికితే ఆయన విలన్‌‌గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు. మాకు వంశీ ఏం చెప్పారో అదే తీశారు. సుధాకర్ రెడ్డి గారు మా ఆయన చేసిన మగాడు సినిమాతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీలీలకు పెద్ద విజయం రావాలి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments