Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

దేవీ
శనివారం, 5 జులై 2025 (18:35 IST)
Nitin
జయం సినిమాతో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కొడుకుగా కథానాయకుడిగా జయం సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత పది సినిమాల ప్లాప్ తర్వాత 2020 లో భీష్మ తో పర్వాలేదు అనిపించాడు. ఆ తర్వాత గత కొన్ని సంవత్సరాలలో చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ వంటి ఆరు ఫ్లాప్‌లను అతను అందించాడు. నిన్న విడుదలైన తమ్ముడు సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. MCA మరియు వకీల్ సాబ్ దర్శకత్వం వహించిన శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.
 
అయితే, తమ్ముడు ప్రచారం సమయంలో నితిన్ కు తమ్ముడు హిట్ పడాలంటూ, అల్లు అర్జున్ కంటే సీనియర్ అంటూ ప్రీ రిలీజ్ వేడుకలో కామెంట్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది నెగెటివ్ గా కూడా మారింది. దానిని నేను పాజిటివ్ గా మాత్రమే అన్నానని దిల్ రాజు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
 
ఏది ఏ మైనా తమ్ముడు సినిమాను ప్రేక్షకులు తీవ్రంగా తిరస్కరించారు. దిల్ రాజు మరో గేమ్ ఛేంజర్ అని నిరూపించారు ప్రేక్షకులు.  తమ్ముడు సినిమా నితిన్ కి ఏడవ ఫ్లాప్. మరి దిల్ రాజు మాత్రం నితిన్ తో ఎల్లమ్మ చిత్రాన్ని బలగం దర్శకుడు వేణుతో తీస్తున్నారు. మరోవైపు దర్శకుడు విక్రమ్ కుమార్‌తో ఒక సినిమాతో లైన్‌లో ఉంచాడు. ఈ సినిమాలతోనైనా నితిన్ తిరిగి పుంజుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments