Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ వరుస పరాజయాలకు "రాబిన్‌‌హుడ్" బ్రేక్ వేసేనా?

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (09:59 IST)
టాలీవుడ్ హీరో నితిన్‌కు గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. ఆయన నటించిన అనేక చిత్రాలు వరుస పరాజయాలను చవిచూశాయి. ముఖ్యంగా నితిన్‌కు "భీష్మ" చిత్రం తర్వాత, అలాంటి హిట్‌ను ఇప్పటివరకు రుచి చూడలేదు. అయితే ప్రస్తుతం నితిన్ గతంలో తనకు "భీష్మ" వంటి హిట్ చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో "రాబిన్‌హుడ్" అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "తమ్ముడు" చిత్రంలో నటిస్తున్నారు. 'రాబిన్‌హుడ్' చిత్రం డిసెంబరులో విడుదలకు సిద్దంగా ఉంది. 
 
ఇకపోతే, 'తమ్ముడు' చిత్రాన్ని మహాశివరాత్రిని పురస్కరించుకుని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
కాగా, ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ గతంలో హీరో నానితో "ఎంసీఏ" (మిడిల్ క్లాస్ అబ్బాయి), పవన్‌ కల్యాణ్‌తో "వకీల్‌సాబ్‌" వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్‌ 'తమ్ముడు'ను కూడా ఓ వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్టు సమాచారం. 
 
ఈ చిత్రం నితిన్‌ కెరీర్‌లో పత్యేకంగా ఉంటుందని, ఇప్పటివరకు నితిన్‌ టచ్‌ చేయని జానర్‌లో రూపొందుతున్న ఈ  సినిమా నితిన్‌కు మంచి సక్సెస్‌ను ఇస్తుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ లయ ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments