Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ స్పై తో కార్తికేయ2 ని దాటి ట్రెండ్ సెట్ చేస్తారు: అక్కినేని నాగ చైతన్య

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (17:06 IST)
Nikhil, Akkineni Naga Chaitanya, Gary BH, K Rajasekhar Reddy
‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై'తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అక్కినేని నాగ చైతన్య ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ.. నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. హ్యాపీ డేస్ లో పక్కింటి కుర్రాడి పాత్రతో మొదలుపెట్టి స్వామిరారా, కార్తికేయ తో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసి కార్తికేయ2 తో బాక్సాఫీసుని షేక్ చేశాడు. ఇప్పుడు స్పై తో ముందుకు రాబోతున్నాడు. తన జర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. స్పై జోనర్ సినిమాలు చేయడం అంత తేలిక కాదు. ఓటీటీ లో ప్రేక్షకులు వరల్డ్ కంటెంట్ ని చూస్తున్నారు,. ఐతే స్పై ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంటర్ నేషనల్ గా అనిపించింది. ఆజాదీ పాట కూడా చాలా నచ్చింది. నిర్మాతలకు అభినందనలు. టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ఐశ్వర్య, సాన్య వెల్ కం టు టాలీవుడ్. ఆర్యన్ రాజేష్, జిషు, అభినవ్ అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడి  గా  పరిచయం అవుతున్న గారీకి ఆల్ ది బెస్ట్. ఆయన  నుంచి మరిన్ని సినిమాలు రావాలి. నిఖిల్ కార్తికేయ 2తో ఒక ట్రెండ్ సెట్ చేశారు.స్పై తో ఆ ట్రెండ్ ని దాటి నెక్స్ట్ లెవల్ కి వెళ్తారని నమ్ముతున్నాను. 29న ‘స్పై’ ని థియేటర్ లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు
 
హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘స్పై’ సినిమా చేయడానికి కారణం నిర్మాత రాజశేఖర్ గారు. కథ విన్న తర్వాత మరో ఆలోచన లేకుండా ఈ కథని ఎంత గ్రాండ్ గా తీద్దామనేదానిపై ద్రుష్టి పెట్టాం. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కార్తికేయ 2 ఇంకా రాలేదు. నన్ను ముందే నమ్మిన రాజన్న, తేజ్ లకు కృతజ్ఞతలు. ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా సినిమా తీశారు. ‘స్పై’ చాలా మంచి సినిమా. ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్, సెకండ్ హాఫ్ గూస్ బంప్స్. నేతాజీ జీవితం చుట్టూ తిరిగే సినిమా ఇది. ఆయన పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి.  నాలుగు రోజుల క్రితమే మళ్ళీ సినిమా చూశాను. గారీ ని హాగ్ చేసుకొని థాంక్స్ చెప్పాను. అంత అద్భుతంగా తీశాడు. ఈ సినిమా పోస్టర్ టీజర్ ట్రైలర్ అన్నిటికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మీరు ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మా కంటెంట్ అంతకంటే బావుంటుంది. మీరు అనుకున్నదాని కంటే గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం. ఇది వాస్తవం. చాలా మంచి సినిమా తీశాం. గర్వపడే సినిమా చేశాం. రాజేష్ భాయ్, జిషు, నితిన్  గారు అందరూ అద్భుతంగా చేశారు. అభినవ్ పాత్ర చాలా కీలకంగా వుంటుంది. ఐశ్వర్య, సాన్య చాలా బ్యూటిఫుల్ గా యాక్ట్  చేశారు. నాగచైతన్య గారు ఈవెంట్ కి రావడం చాలా అనందంగా వుంది. ఈవెంట్ కి  వచ్చి మాకు ధైర్యం ఇచ్చారు. ఆయన రాకతో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. చైతు గారికి కృతజ్ఞతలు. జూన్ 29న థియేటర్ లో మిస్ కావద్దు. స్పై ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా . ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా. పేరెంట్స్ పిల్లలకి చూపించాల్సిన సినిమా . స్పై నాకు మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. 29న థియేటర్స్ లో కలుద్దాం. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్ మూర్తి నాయుడు ఇకలేరు

నన్ను ప్రేమించకపోతే నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ చేస్తా: యువతికి ప్రేమోన్మాది బెదిరింపులు

600 కార్లతో అట్టహాసంగా మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్.. ఇప్పుడు అటువైపు కనీసం చూడడం లేదు ఎందుకు?

శివాజీ నడిచిన నేల.. ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదు.. పవన్ కల్యాణ్ (video)

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.. రేవంత్ రెడ్డి కారును తనిఖీ చేసిన పోలీసులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments