Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

డీవీ
శనివారం, 1 జూన్ 2024 (17:11 IST)
Nikhil two swords Swayambhu
హీరో నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ'లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్ వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ 'స్వయంభూ'లో తన మ్యాజిక్‌ చూపించనున్నారు.
 
మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ టాప్  టెక్నిషియన్ ఇప్పటికే టీంలో చేరారు. మ్యాసీవ్ సెట్స్ తో గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోందని మేకింగ్ వీడియో చూస్తే అర్ధమౌతోంది. నిఖిల్‌కి ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా ఇదే.
 
కెకె సెంథిల్ కెమెరా డీవోపీగా చేయడంతో సినిమాలోని విజువల్స్ టాప్ నాచ్‌గా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో జరుగుతోంది.
 
నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా  రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్ గా ప్రజెంట్ చేస్తోంది. మెరూన్ కలర్ కాస్ట్యూమ్ ధరించి, పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసాలు, గడ్డం, మజల్ద్ ఫిజిక్, బైసప్స్ తో బీస్ట్ మోడ్ లో కనిపించారు నిఖిల్.  
 
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం వెపన్స్, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్.
 
రిచ్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
నటీనటులు: నిఖిల్, సంయుక్త, నభా నటేష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments