Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

దేవీ
సోమవారం, 2 జూన్ 2025 (07:43 IST)
Nikhil, Samyukta new poster
నిఖిల్ 'కార్తికేయ 2' విజయంతో ఇప్పుడు మరో ఇండియా వెంచర్ 'స్వయంభు'తో వస్తున్నాడు, ఇది అతని 20వ మైల్ స్టోన్ మూవీ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ  గ్రాండ్-స్కేల్ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో వుంది. ఈ చిత్రంలో నిఖిల్‌ మునుపెన్నడూ చూడని యోధునిగా కనిపిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ని టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాన్-ఇండియా విజన్ తో రూపొందిస్తున్నారు.
 
స్వయంభు టీం నిఖిల్ పుట్టినరోజున పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నిఖిల్, సంయుక్త యుద్ధ నేపథ్యంలో కనిపించిన ఈ పోస్టర్‌ అదిరిపోయింది. నిఖిల్ యుద్ధం మధ్యలో కత్తి పట్టుకుని యోధుడిలా పవర్ ఫుల్ గా కనిపించారు. అతని పక్కన, సంయుక్త విల్లు  బాణంతో నిలబడి టార్గెట్ ని చేరుకున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. ఈ పోస్టర్ సినిమా గ్రాండ్ స్కేల్ ని ప్రజెంట్ చేస్తోంది.  బ్యాక్ డ్రాప్ లో సెంగోల్ చాలా ఆసక్తికరంగా వుంది.  
 
సెంగోల్ శక్తి, ధర్మానికి చిహ్నం. ప్రాచీన రాజ్యాల నుండి భారతదేశ స్వాతంత్ర్యం వరకు, సెంగోల్ ఎంతో ప్రాముఖ్యత వుంది. మన ప్రాచీన చరిత్ర ప్రకారం, శ్రీ రాముడు సెంగోల్‌ను నీతిమంతమైన పాలనకు చిహ్నంగా అందుకున్నారు, ఇది న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచింది.
 
ఇటీవల, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశ గొప్ప వారసత్వానికి నివాళులర్పిస్తూ కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ సీటు దగ్గర సెంగోల్‌ను ప్రతిష్టించారు.
 
ఇప్పుడు, స్వయంభు ఈ శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ అద్భుతమైన కథతో వస్తోంది. రాబోయే టీజర్ ఈ ఎక్సయిటింగ్ వరల్డ్ ని మరింత రివిల్ చేయనుంది.
 
నభా నటేష్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments