Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 15.6 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోన్న నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు

డీవీ
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (17:35 IST)
Committee Kurrollu Collections
డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. ఇప్ప‌టికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రూ.15.6 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌టం విశేషం.
 
కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ చాల‌నే డైలాగ్ త‌ర‌హాలో మంచి క‌థ‌తో చేసిన సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో నిహారిక అండ్ టీమ్ క‌మిటీ కుర్రోళ్ళు సినిమాను ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. రోజు రోజుకీ ఆద‌ర‌ణ‌తో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను కూడా పెంచుకోవ‌టంలో క‌మిటీ కుర్రోళ్ళు స‌క్సెస్ అయ్యారు. సినిమా విజ‌య‌వంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. రెండో వారం కంటే మూడో వారంలో సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం.
 
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకుంటోందీ చిత్రం.
 
కమిటీ కుర్రోళ్ళు సినిమాను ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌లోనే చూసి ఆద‌రించాల‌ని శాటిలైట్ మరియు ఓటీటీ హ‌క్కుల‌ను ఇంకా ఎవ‌రికీ ఇవ్వ‌లేదని చిత్ర యూనిట్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ధృవ్ పటేల్‌కు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటం

కోల్‌కతా మెడికో హత్యాచార కేసు : 41 రోజుల తర్వాత ఆందోళన విరమించిన ఆర్జీ కర్ వైద్య విద్యార్థులు

ఇన్ యాక్టివ్ జీ మెయిల్ అకౌంట్‌లపై గూగుల్ కీలక నిర్ణయం.. ఏంటది?

ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు.. ప్రకాశం జిల్లా టూర్

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments