Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింకప్ - డేటింగ్ రూమర్స్ అంటే నాకు నచ్చవు : నిధి అగర్వాల్

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (19:18 IST)
దర్శకుడు చందూ మొండేటి - హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచమయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల్లో నటించింది. ఇపుడు ఈ అమ్మడుకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో తన గురించి ఏవైనా గాసిప్స్ వస్తే తనకు అస్సలు నచ్చదని ఆమె వ్యాఖ్యానిస్తోంది. ఈ బ్యూటీ ఎప్పుడైనా స్నేహితుల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్తే పుకార్లు రాకుండా చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటుంది. 
 
ప్ర‌స్తుతం నేను చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నా. ఫ్రెండ్‌తో క‌లిసి డిన్న‌ర్‌కు వెళ్లాల్సి వ‌చ్చినా కేర్‌ఫుల్‌గా ఉంటున్నా. లింక‌ప్, డేటింగ్ రూమ‌ర్స్ అంటే నాకు న‌చ్చ‌వు. అందుకే ఎప్పుడైనా ఫ్రెండ్‌‌తో బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చిన‌పుడు ఎక్క‌డికెళ్లాలో డిసైడ్ చేయాల‌ని వారికే చెపుతానని వెల్లడించారు. 
 
నా ల‌వ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. నాన్‌స్టాప్‌గా ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నా. నేను పూర్తిగా సింగిల్‌. మెసేజ్ చేయ‌డానికి, కాల్ చేసేందుకు నాకు ఎవ‌రూ లేరు. ప్ర‌స్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవ‌రైనా నా జీవితంలోకి వ‌స్తే.. సంతోష‌మే కానీ.. నేను రిలేష‌న్‌షిప్ కోసం వెయిటింగ్ చేయ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ నీతులు చెప్పడం హాస్యాస్పదం : అద్దంకి దయాకర్

వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్

మానసిక సమస్యతో బాధపడుతున్న కొడుకును చూడలేక....

మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై విద్యార్థుల దాడి

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

తర్వాతి కథనం
Show comments